కోటనందూరు, తుని, తొండంగి

237వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

August 14, 2018

తుని : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 237వ రోజు మంగళవారం విశాఖ జిల్లాలోకి ప్రవేశించింది. నర్సీపట్నం నియోజకవర్గం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి అడుగుపెట్టిన జననేతకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు.

అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా కాకరపల్లి నుంచి ఈరోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. జననేత వెంట నడిచేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. విశాఖపట్నం జిల్లాలో శరభవరం, శృంగవరం, గాంధీనగర్‌, వై దొండపేట జంక్షన్‌, ఎర్రవారం మీదుగా ఈరోజు పాదయాత్ర కొనసాగనుంది. సుమారు నెల రోజుల పాటు విశాఖ జిల్లాలో ప్రజాసంకల్పయాత్రకొనసాగనుంది.

You Might Also Like

No Comments

Leave a Reply