కోటనందూరు, తుని

ప్రైవేటు స్కూళ్ల ఫీజులకు కళ్లెం వేస్తాం: వైఎస్‌ జగన్‌

August 12, 2018

తుని,తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రైవేటు స్కూల్స్‌, కాలేజీల అధిక ఫీజులకు కళ్లెం వేస్తామని ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. గవర్నమెంట్ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం స్కూళ్లుగా మారుస్తామని, సర్కారీ బడులు లేని చోట కొత్తవి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అన్ని స్కూళ్లలో టీచర్లు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడిలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. నారాయణ, శ్రీచైతన్య వంటి ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులతో పేదవాడిని దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్‌, డాక్టర్‌ చదువులు చదవాలంటే భూములు, బంగారం, ఇళ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాగు నీరులేని గ్రామాలు ఉన్నాయి తప్ప.. వైన్ షాపులు లేని గ్రామం ఒక్కటి కూడా లేదని జగన్ విమర్శించారు.

You Might Also Like

No Comments

Leave a Reply