తొండంగి

డప్పు కళాకారులను ఆదుకోండన్నా..

August 13, 2018
తుని,తూర్పుగోదావరి : డప్పు కళాకారులను ఆదుకోండన్నా అంటూ విశాఖజిల్లా పాయకరావుపేటకు చెందిన డప్పు కళాకారులు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ప్రజాసంకల్పయాత్రలో వారు జగన్‌ను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకొన్నారు. 50 సంవత్సరాలు దాటిన డప్పు కళాకారులకు రూ.1500 పింఛను ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చి అమలు చేయలేదన్నారు. దీనివల్ల తామంతా అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. అలాగే గ్రామాల్లో మాదిగ మాణ్యాలు కబ్జాకు గురౌతున్నాయన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 45 ఏళ్లు దాటిన డప్పు కార్మికులకు పింఛన్లు మంజూరు చేయడంతో పాటు, కబ్జాలో ఉన్న మాదిగ మాణ్యాలను తిరిగి తమకు అప్పగించాలని డప్పు కళాకారులు  గంపల సత్యనారాయణ, తుమ్మలపల్లి కుమార్, గంపల అన్నవరం, గంపల సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు.

You Might Also Like

No Comments

Leave a Reply