తొండంగి

క్షేత్ర సహాయకులను అక్రమంగా తొలగించారన్నా

August 13, 2018

తూర్పుగోదావరి  :మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో 2007 నుంచి విధులు నిర్వహిస్తున్న తమను టీడీపీ ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద తుని నియోజకవర్గ ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా తుని రూరల్‌ గండి క్యాంపు కార్యాలయం వద్ద జననేతను కలిసి వినతి పత్రం అందజేశారు.  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తమను నియమించారన్నారు. టీడీపీ నాయకులు తమపై కక్ష కట్టి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా విధుల నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.  వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు.

You Might Also Like

No Comments

Leave a Reply